5 శాతం వృద్ధి సాధించిన కోటక్‌ బ్యాంక్

67చూసినవారు
5 శాతం వృద్ధి సాధించిన కోటక్‌ బ్యాంక్
ప్రైవేటు బ్యాంక్ కోటక్‌ మహీంద్రా రెండో త్రైమాసిక లాభంలో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.3,344 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ లాభం రూ.3,191 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం రూ.13,507 కోట్ల నుంచి రూ.15,900 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్‌ రూ.5,044 కోట్లు లాభాన్ని నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్