మంత్రి నారా
లోకేశ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మం. నిమ్మనపల్లి గ్రామానికి చెందిన హసీనా అనే మహిళ సౌదీలో చిక్కుకున్నారు. ఆమెను రక్షించాలని కోరుతూ ఓ నెటిజన్
లోకేశ్ ను ట్యాగ్ చేశారు. అందుకు సానుకూలంగా బదులిచ్చిన మంత్రి ఆ విజ్ఞప్తిని నోట్ చేసుకున్నట్లు తెలిపారు. హసీనాను ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.