ఏపీ ప్రజలందరికీ మంత్రి నారా లోకేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు తీసుకురావాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. గడిచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంసం, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారు.