గ్రహశకలాల్ని చిన్న గ్రహాలు అని కూడా అంటారు. ఇవి పూర్తిగా రాళ్లే. 460 కోట్ల సంవత్సరాల కిందట సౌర కుటుంబం ఏర్పడినప్పుడు ఇవి ఏ గ్రహంతోనూ కలవలేదు. స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇప్పటివరకూ వేసిన లెక్కల ప్రకారం మన సౌర వ్యవస్థలో 11,13,527 గ్రహశకలాలు ఉన్నాయని నాసా చెప్పింది. ఈ గ్రహశకలాల్లో అతి పెద్దది వెస్టా. దీని పరిమాణం 530 కిలోమీటర్లు. అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి ఎంత దూరమో దాదాపు అంత పెద్దగా ఉంటుంది.