త్వరలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. మ్యాచ్‌లు జరుగబోయే వేదికలను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ జరిగే గడాఫీ స్టేడియం (లాహోర్), నేషనల్ బ్యాంక్ స్టేడియం (కరాచీ)కు మార్చింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ స్టేడియాలలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా అవి నత్తనడకన సాగుతున్నాయన్నారు.