తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు స్వామి వారి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ అధికారులు విఫలం అయ్యారని ఆరోపించారు. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగినన్ని రోజులు మరింత అప్రమత్తంగా ఉంటూ భక్తులకు దర్శనం కల్పించాలన్నారు.