AP: మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవత్వం చాటుకున్నారు. కోనసీమ జిల్లా గుమ్ములేరు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి సుభాష్ యాక్సిడెంట్‌ను చూసి చలించిపోయారు. తన కాన్వాయ్‌లో మహిళను ఆస్పత్రికి తరలించారు. మంత్రి స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.