TG: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 17వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేకమైన డాగ్స్ సాయంతో నిన్న ఓ మృతదేహాన్నిగుర్తించారు. 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు TBM ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ గా అధికారులు గుర్తించారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.