AP: ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి పార్థసారథి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.