ప్రేమ అన్నది చాలా విలువైన పదం. ప్రేమించబడటం చాలా గొప్ప విషయం. మారుతున్న కాలం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రేమ అనే పదానికి విలువ లేకుండా పోతుంది. కేవలం సుఖం కోసం మాత్రమే ప్రేమ అనే రెండు అక్షరాలను అడ్డం పెట్టుకొని యువత తప్పు దోవలో నడుస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. ప్రేమ కోసం కులం, ప్రాంతం, దేశం ఏవి చూడకుండా ఇద్దరు వ్యక్తులను కలిపేదే ప్రేమ. అటువంటి ప్రేమకు ప్రస్తుతం వక్రమార్గం ఉంచుకుంటూ ప్రేమ అనే పదానికి మచ్చ తీసుకువస్తున్నారు. సోషల్ మాధ్యమాలలో కాసేపు పరిచయానికి ప్రేమించుకోవడం ఒకరి మొహం ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకోవడం. కలుసుకోవడం లేదా ఒకరి మీద ఒకరికి మోజు తీరిపోయాక మొహం చాటేయడం ఇటీవల కాలంలో ఇలాంటి చాలా సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
అంతేకాదు ప్రేమ రూపంలో అబ్బాయిలను అమ్మాయిలు, అమ్మాయిలకు అబ్బాయిలు..బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రేమ అనే పదానికి విలువ తగ్గిస్తున్నారు. ప్రేమ అనేది వివిధ రూపాలలో ఉంటుంది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క ప్రేమ, చెల్లి ప్రేమ, అన్న ప్రేమ తమ్ముడు, ప్రేమ ఇలా కుటుంబంలో ఉండే ప్రతి రిలేషన్ కి ఓ ప్రేమ అనే భావం కూడా ఉంటుంది. పెద్దలు పెళ్లి చేశాక ఆడపిల్లను భర్తను ప్రేమించమని చెప్తారు. కానీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంనీ ఉపయోగించుకొని ప్రేమ పేరుతో అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు. అంతే కాదు అవసరమైతే కట్టుకున్న భర్తను కూడా కడ చేర్చేందుకు వెనకాడటం లేదు. ఒక్కసారి ఆలోచించండి మనసును తమ ఆధీనంలో ఉంచుకోండి..ప్రేమ అనే గొప్ప పదానికి మచ్చ తేకండి..బాంధవ్యాలు వెల్లివిరిసే లాగా ప్రేమ అనే పదానికి సరైన నిర్వచనం తెలిసేలాగా వ్యవహరిస్తూ ప్రేమకు గొప్ప అర్థం తెలియజేయండి. ప్రేమ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న వారికి దూరంగా ఉండి మంచి మార్గంలో యువత నడవాలని కోరుకుందాం.