ఏపీలో కూటమి ప్రభుత్వం శనివారం రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుల్లో కూడా పిఠాపురం వర్మకు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎటువంటి పదవి దక్కలేదు. అయితే ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం ఇన్‌ఛార్జి వర్మకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.