ప్రతి నెల అకౌంట్లలోకి డబ్బులు

292201చూసినవారు
ప్రతి నెల అకౌంట్లలోకి డబ్బులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మహిళలకు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా.. మహిళల సాధికారత కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ‘ఇందిరమ్మ అభయం’ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళకు నెలకు రూ.5 వేలు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఇదే మహిళలకు కాంగ్రెస్ ఇస్తున్న భరోసా అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్