రాయలసీమ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 28న చేపట్టబోవు ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక రెవెన్యూ భవన్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలులొ 2002లో రాయలసీమ మిల్లు మూతపడిన తర్వాత దాదాపు 20వేల మంది కార్మికులకు ఇప్పటివరకు పిఎఫ్, పింఛన్, 18నెలలు పని చేసిన మొండి బకాయి జీతాలు వెంటనే చెల్లించలేదన్నారు.