ఆళ్లగడ్డ పట్టణంలోని పుల్లారెడ్డి వీధిలోగల షేక్ అలీఫా 3వర్ధంతి సందర్భంగా గురువారం కుటుంబ సభ్యులు తల సేమియాతో బాధపడే చిన్నారులు, గర్భిణీ మహిళల కోసం ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, బీరువాళ్ళ భాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ పాల్గొన్నారు.