ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో నంద్యాల రెవెన్యూ ఆర్డీవో, మండల తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన రీ సర్వేలో ఏమైనా లోటుపాట్లు ఉంటే రైతులు రెవెన్యూ సదస్సులలో సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ రవి ప్రకాష్ విఆర్వోలు పాల్గొన్నారు.