ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చే యురేనియం త్రవ్వకాలకు కేంద్రం ఇచ్చిన అనుమతులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య అన్నారు. ఆదివారం కప్పట్రాళ్లలో పర్యటించి మాట్లాడారు. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరిపితే అడ్డుకుంటామని హెచ్చరించారు.