రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లోనే వేదావతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా తీరని అన్యాయం చేశారని సీపీఎం కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరశేఖర్, హనుమంతు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆస్పరిలో వారు మాట్లాడారు. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో వేదావతి ప్రాజెక్టు నిర్మిస్తే సాగు, తాగునీరు కల్పించవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం వేదావతి, నగరడోణ ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు.