చిప్పగిరి మండలంలోని నేమకల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బీమలింగప్ప అధ్యక్షతన 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. సమాజంలో అసమానతలను రూపు మాపెందుకు రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు పాటు కృషి చేసి రచించారని తెలిపారు. రాజ్యాంగమే భారత దేశానికి రక్షణ కవచమని బీమలింగప్ప విద్యార్థులకు వివరించారు.