ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిల కోసం ఈ ఖాతాలను తెరవొచ్చు. 2వ కాన్పు కవలలు(అమ్మాయిలు) అయితే ముగ్గురు అమ్మాయిల తరపున ఖాతాలను తెరవొచ్చు. సాధారణంగా 10 ఏళ్ల లోపు మైనర్ తరపున ఈ ఖాతాలను తెరుస్తారు కాబట్టి, తండ్రి గానీ సంరక్షకుడు గానీ ఖాతాను తెరవొచ్చు. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీ కలిపి పోస్టాఫీసు చెల్లిస్తుంది. ఎటువంటి ఆదాయపన్ను ఉండదు. వడ్డీ రేటు 8%, ఏడాదికి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.