నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా వాయుగుండం కదులుతోంది. దీని ప్రభావంతో రాగల 5 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది.