ఏపీ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

55చూసినవారు
బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్‌రెడ్డి మొదట వ్యాపారవేత్త, కాటసాని రామిరెడ్డి ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు 2010లో రాజకీయ రంగప్రవేశం చేశారు. 2011లో టీడీపీలో చేరి, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 2019 లో ఓటమి చెంది, 2024లో గెలుపొంది మంత్రి అయ్యారు.

సంబంధిత పోస్ట్