కోవెలకుంట్ల మండలంలోని ఆయా ఫీడర్ల పరిధిలో సోమవారం నుంచి వ్యవసాయ రంగానికి పగటి వేళల్లో తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా ఉంటుందని ఆ శాఖ ఏఈ రామమోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవెలకుంట్ల, కలుగొట్ల, గుళ్లదూర్తి, జోళదరాశి, భీమునిపాడు, అమడాల, గుంజలపాడు, రేవనూరు, కలుగొట్ల, పొట్టిపాడు, హరివరం, కొత్తపల్లె, అల్లూరు పీడర్లకు సంబంధించి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు.