హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువతులు చేసిన పని నెట్టింట ప్రశంసలను కురిపిస్తోంది. వినీత, నికిత అనే ఇద్దరు వ్లాగర్‌లు కొత్త ఏడాది, సంక్రాంతి పండుగ సందర్భంగా డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ ద్వారా కొన్ని వస్తువలను ఆర్డర్ చేశారు. అయితే, వాటిని వారు తీసుకోకుండా ఎవరైతే వారికి డెలివరీ ఇచ్చారో వారికే బహుమతిగా అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.