వేరే వారికి పుట్టిన బిడ్డను వైసీపీ తన బిడ్డగా చెప్పుకొంటుంది: మంత్రి నిమ్మల

69చూసినవారు
వేరే వారికి పుట్టిన బిడ్డను వైసీపీ తన బిడ్డగా చెప్పుకొంటుంది: మంత్రి నిమ్మల
AP: గత జగన్ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పాలకొల్లులో 70 మందికి వైద్య ఖర్చుల కోసం.. సీఎం సహాయ నిధి నుంచి రూ.60 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. '2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ తమ పాలనలో వచ్చిందంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. వైసీపీ తీరు ఎలాం ఉందంటే.. వేరే వారికి పుట్టిన బిడ్డను.. తన బిడ్డ అని చెప్పుకొనే చందంగా ఉంది' అని ద్వజమెత్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్