ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. అఫ్జల్‌గఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను రిపేర్ నిమిత్తం శుక్రవారం స్థానిక షాపునకు తీసుకెళ్లాడు. రిపేర్ చేసే టెక్నీషియన్ ఆ ఫోన్‌ను పరిశీలించి ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. బ్యాటరీ ముక్కలు టెక్నీషియన్ కంటిలోకి దూసుకెళ్లాయి. దీంతో బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.