సంజామల మండల వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు గురువారం ఉ. 6గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఎంపీడీవో విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. మండలంలో 5, 254 పింఛన్లు ఉండగా, రూ. 2. 20 కోట్ల నగదును ఇప్పటికే ఉద్యోగులకు అందజేసినట్లు ఎంపీడీవో వెల్లడించారు. పింఛన్ లబ్దిదారులు సకాలంలో అందుబాటులో ఉండి తమ పింఛన్ నగదు పొందాలన్నారు. 100 శాతం పంపిణీ చేయాలని ఎంపీడీవో ఆదేశించారు.