ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు దీపం పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ల పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ఆద్యుడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతులు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం బనగానపల్లెలో కొనియాడారు. మహిళలకు పొగరహిత వంట గ్యాస్ ను అందించడంతో పాటు, మహిళల వంట ఇంటి కష్టాలకు చెక్ పెట్టిన ఘనత సైతం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ మంత్రి ప్రారంభించారు.