కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పలు ప్రధాన రహదారుల్లో నంద్యాల మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ తిరుమల నాయుడు గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు రవాణా శాఖ నిబంధనలు వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా సాగిస్తున్న ఒక లారీ, ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని అపరాధ రుసుం విధించారు. పట్టుబడిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.