కోవెలకుంట్లలో ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూనది

75చూసినవారు
కోవెలకుంట్లలో ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూనది
రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు ఆదివారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుందూనదికి భారీగా నీటిని విడుదల చేయడంతో కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో కుందూనదికి అనుసంధానంగా ఉన్న వాగుల్లోకి వరద నీరు పోటెత్తింది. వల్లంపాడు, చిన్నకొప్పెర్ల, లింగాల, పెద్దకొప్పెర్ల, ఇరుకుమాను వాగుల వంతెనలపై వరద నీరు ప్రవహిస్తోంది.

సంబంధిత పోస్ట్