బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విచారణ చేపడుతున్న ప్లోరమ్మ

76చూసినవారు
బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విచారణ చేపడుతున్న ప్లోరమ్మ
డోన్ పట్టణంలోని గుత్తిరోడ్డులోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సీట్లు, తదితర వాటిపై వచ్చిన అభియోగంపై జిల్లా కన్వీనరు ప్లోరమ్మ బుధవారం పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. జిల్లా అధికారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్ను ఆదేశించామన్నారు. ఆ నివేదికను జిల్లా సర్వోన్నతాధికారికి అందించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్