పాత పన్నుల విధానంలో ఎలాంటి మార్పు చేయకుండా కొత్త పన్నుల విధానంలో మాత్రమే మార్పులు చేయడం వల్ల వేతన జీవులకు ఎలాంటి ఊరట కలగలేదని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ విమర్శించారు.
యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ అధ్యక్షతన ప్యాపిలి యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ సిపియస్ విధానంలో మార్పులు తెస్తామని చెప్తూనే పాత పెన్షన్ విధానంపై పల్లెత్తుమాట బడ్జెట్ లో లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశ కలిగించిందన్నారు.