కోడుమూరు: అధిక రేట్లకు ఆయిల్ ప్యాకెట్లు విక్రయిస్తే చర్యలు
By NIKHIL 71చూసినవారుకిరాణా దుకాణదారులు అధిక రేట్లకు ఆయిల్ ప్యాకెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని కోడుమూరు, గూడూరు తహసీల్దార్లు వెంకటేష్ నాయక్, రామాంజనేయులు హెచ్చరించారు. గురువారం కోడుమూరు, గూడూరులోని కిరాణ అంగళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల విపరీతంగా పెరుగుతున్నాయంటూ అధిక రేట్లకు ఆయిల్ పాకెట్లను విక్రయిస్తున్నారని, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని సూచించారు.