కర్నూలు మండలం ఉల్చాలలో అక్రమ బెల్ట్ షాపులు అరికట్టాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు డీఎస్పీ రామకృష్ణారెడ్డికి అందజేశారు. శనివారం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్, అలివేలమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రాఘవేంద్ర, ఉపాధ్యక్షుడు సాయి ఉదయ్ మాట్లాడారు. ప్రధాన రహదారులపై అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించడంతో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. డీఎస్పీ హామీ ఇచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు.