కోడుమూరు: విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు వాడొద్దు

50చూసినవారు
కోడుమూరు: విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు వాడొద్దు
పంటల్లో విచక్షణా రహితంగా పురుగు మందులు, రసాయనిక ఎరువుల వాడకం ప్రమాదకరమని కోడుమూరు వ్యవసాయాధికారి రవిప్రకాష్ అన్నారు. మంగళవారం కోడుమూరు మండలం గోరంట్లలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది ప్రదీప్, రాజేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్