డ్రోన్ టెక్నాలజీపై పోలీసులు అవగాహన పెంచుకొవాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పోలీసు శిక్షణ కేంద్రంలో డ్రోన్ టెక్నాలజీపై, సైబర్ నేరాల టెక్నాలజీపై 2 రోజుల పాటు 21 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఎస్పీ పరిశీలించి, మాట్లాడారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 400 మందిని డ్రోన్ ఆపరేటర్స్ తీర్చిదిద్దే విధంగా వినూత్న కార్యక్రమం చేస్తామన్నారు.