కోడుమూరు: ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు పట్టివేత

61చూసినవారు
సి. బెళగల్ మండలంలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టివేసినట్లు ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీస్ సిబ్బందితో మండలంలోని గ్రామాలలో గస్తీ నిర్వహించగా తుంగభద్ర నదితీర తిమ్మందొడ్డి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరు టాక్టర్లు పట్టబడ్డాయన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్