కోడుమూరు: సుంకేసులకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

65చూసినవారు
తుంగభద్ర జలాశయానికి మళ్లీ వరదనీరు పోటెత్తింది. దీంతో సోమవారం ఉదయం కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. డ్యాంకు 92, 950 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో, 22 గేట్లు ఎత్తి 90, 494 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు, 0. 917 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్