కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో వెలసిన శ్రీగిడ్డాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా సీనియర్ నాయకులు కోట్ల హరిచక్రపాణి రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలతో పాటు యాగం నిర్వహించారు. భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.