వర్షాకాలం ముగిసేంతవరకు దాదాపు మరో నెల దాకా కర్నూలు జిల్లాలో శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో శానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తాగునీటికి క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.