సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందజేయాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు రూరల్ మండలం పి. రుద్రవరంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందజేసి, అనంతరం స్థానిక సచివాలయాన్ని సందర్శించి, సకాలంలో విధులకు హాజరు కావాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఉద్యోగులకు సూచించారు.