గుంటూరు జిల్లా వీరగండ్లలో జరిగే 68వ రాష్ట్రస్థాయి ఎస్సీజిఎఫ్ అండర్-17 రగ్బీ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారుల జాబితాను ఆర్గనైజింగ్ సెక్రటరీ గిడ్డయ్య బుధవారం ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టోర్నమెంట్ లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లాకు పతకాలు తీసుకు రావాలని కోరారు.