ఎవరైనా అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు చేస్తే, వారిపై ప్రేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని విక్రయదారులకు తెలిపారు.