రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతుందని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. శుక్రవారం కర్నూలు రూరల్ మండలంలోని పసపుల గ్రామం నుంచి గార్గేయపురం వరకు 10 కి. మీ. మేర రూ. 4. 80 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులను కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు.