క్రీడాకారులు లక్ష సాధన కోసం కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. బుధవారం కర్నూలులోని ఆదర్శ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 68వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 రగ్బీ ఛాంపియన్షిప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేవలం ఉద్యోగాల మీద దృష్టి పెట్టక, ప్రైవేటుగా సొంతంగా ఉపాధి చూసుకునే అవకాశాల ఉండేటటువంటి ధైర్యాన్ని క్రీడాకారులు అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడ రంగానికి మరింత నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.