ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి

84చూసినవారు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి
కర్నూలు పట్టణాల్లోని దళిత వాడల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దళితవాడల అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను తీసుకొచ్చినా అమలు చేయడం లేదన్నారు. దీంతో దళితవాడల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్