మంత్రాలయం: దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి

80చూసినవారు
మంత్రాలయం: దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి
కోసిగి దాడిలో గాయపడి వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఒక వృద్ధుడు మంగళవారం చికిత్సలో కోలుకోలేక మృతి చెందాడు. కడదొడ్డికి చెందిన కృష్ణయ్య (69) కుమారుడు గతనెల ఓ బాలికపై జరిగిన అత్యాయత్నంలో సహకరించాడని పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కుమారుడి ఆచూకీ తెలిపాలంలో కృష్ణయ్యపై బాలిక బంధువులు దాడి చేశారు. గాయపడిన కృష్ణయ్య కర్నూలులో చికిత్స అనంతరం స్వగ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్