పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటంతో భారీ ర్యాలీ నిర్వహించారు. నరవ స్వగృహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ జోహార్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.