నందికొట్కూరు పట్టణంలో ఏబీఎం పాలెం మునకు చెందిన కాటేపోగు ప్రకాష్ అనారోగ్యం వల్ల అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్థానిక నాయకులతో కలిసి మృతుని కుటుంబం వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతుడు ప్రకాష్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఆదివారం నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట టిడిపి నాయకులు కౌన్సిలర్స్ భాస్కర్ రెడ్డి, చిన్నరాజు, కళాకర్ తదితరులు పాల్గొన్నారు.