టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ను నందికొట్కూరు నియోజకవర్గo శాసనసభ్యులు గిత్త జయసూర్య శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు.