నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జూనియర్ కాలేజి నిర్మాణానికి నాడు నేడు పథకం కింద మంజూరైన నిధులతో చేపట్టిన గదుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది
జూనియర్ కాలేజ్ కి 99 లక్షల రూపాయలు కేటాయించగా అందులో కేవలం 46 లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేశారని దీనితో పనులు పూర్తి చేయలేకపోయామని హెచ్ఎం తెలిపారు. ప్రభుత్వం స్పందించి గదుల నిర్మాణం పూర్తి చేయాలని తల్లిదండ్రులు ఆదివారం తెలిపారు